తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో 198 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
ఈ నియామకాల్లో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రెయినీ – 85 పోస్టులు, మెకానికల్ సూపర్వైజర్ ట్రెయినీ – 114 పోస్టులు ఉన్నాయి. పోస్టుల సంఖ్య తాత్కాలికమని, అవసరమైతే మార్పులు జరిగే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
ఈ రెండు పోస్టులకు నెలవారీ వేతనం రూ.27,080 నుంచి రూ.81,400 వరకు ఉంటుంది. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రెయినీ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మెకానికల్ సూపర్వైజర్ ట్రెయినీ పోస్టుకు ఆటోమొబైల్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్లో డిప్లొమా అర్హతగా నిర్దేశించారు.
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీలు
ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 30 నుంచి జనవరి 20 వరకు, ప్రతి రోజు ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు TSLPRB అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు వివరాలు
-
SC, ST, తెలంగాణకు చెందిన లోకల్ అభ్యర్థులు: రూ.400
-
ఇతర అభ్యర్థులు: రూ.800
వయో పరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
అయితే, ప్రత్యేక కేటగిరీలకు వయో సడలింపులు ఉన్నాయి:
-
SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు
-
మాజీ సైనికులకు ఆర్మ్డ్ ఫోర్సెస్లో సేవ చేసిన కాలానికి అదనంగా 3 సంవత్సరాల సడలింపు
-
TGSRTCలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు 10 సంవత్సరాల వరకు సడలింపు, అయితే వారి వయస్సు 2025 జూలై 1 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు
-
SC, ST, BC వర్గాలకు చెందిన TGSRTC ఉద్యోగులకు సేవ చేసిన సంవత్సరాల మేర సడలింపు, గరిష్ఠ వయస్సు 45 సంవత్సరాలు
TGSRTC 198 ఖాళీలు నియామకం తెలంగాణ యువతకు మంచి అవకాశమని అధికారులు పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.










