రాజకీయాల్లో.. వ్యక్తిత్వం ముఖ్యం

  • విజయసాయి రాజీనామాపై జగన్‌

అమరావతి, ఫిబ్రవరి 6: వైకాపాను వీడిన రాజ్యసభ ఎంపీలపై ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ స్పందించారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వాసం ముఖ్యమన్నారు. ప్రలోభాలకు లొంగో, భయపడో వ్యక్తిత్వం తగ్గించుకుంటే ఎలా.. అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి సహా పార్టీ నుంచి వెళ్లిపోయిన అందరికీ ఇదే వర్తిస్తుందన్నారు. ఇంకా ఒకరో.. అరో వెళ్లిపోయేవాళ్లుంటే వాళ్లకైనా అంతేనని వ్యాఖ్యానించారు. వైకాపా నేడు ఉందంటే అది నాయకుల వల్ల కాదని చెప్పారు. ఇటీవల విజయసాయిరెడ్డి వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగన్‌ స్పందించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News