ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇందులో 898 పాయింట్లతో అగ్రస్థానంలో వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్న ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో వరుసగా జో రూట్ (897), కేన్ విలియంసన్ (812), SV జైస్వాల్ (811), ట్రావిస్ హెడ్ (781)లు ఉన్నారు. ఆస్ట్రేలియాతో మిగిలిన మూడు మ్యాచుల్లో రాణిస్తే జైస్వాల్ అగ్రస్థానానికి చేరుకునే ఛాన్స్ ఉంది.
