
“సుమతీ శతకం” చిత్రం నుంచి రెండో సాంగ్ విడుదల
సుమతీ శతకం చిత్రానికి సంబంధించిన రెండవ పాట ‘సుమతి సుమతి’ తాజాగా విడుదలైంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్నారు. టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్‌పేట్ శైలజ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా విడుదలైన ‘సుమతి సుమతి…’ పాట ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ పాటకు కృష్ణ మాదినేని లిరిక్స్ అందించగా, గోల్డ్ దేవరాజ్ గానం ఆకట్టుకునేలా ఉంది. సుభాష్ ఆనంద్ సంగీతం పాటను మరింత వినసంపుడిగా మార్చింది. “నా కుట్టీ కుట్టీ సుమతీ, నా చిట్టీ చిట్టీ సుమతీ…” అంటూ సాగే ఈ పాటలో హీరో తన ప్రేమను సరదాగా, సింపుల్‌గా వ్యక్తపరిచిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అమర్దీప్–శైలి చౌదరి మధ్య కెమిస్ట్రీ, పాటలోని సింపుల్ కానీ ఫ్రెష్ డాన్స్ స్టెప్స్ యువతను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. ఈ పాట త్వరలోనే చార్ట్‌బస్టర్‌గా మారుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘ఎక్కడే ఎక్కడే’ పాటకు వచ్చిన స్పందనను దృష్టిలో ఉంచుకుంటే, ‘సుమతి సుమతి’ కూడా సినిమాకు మంచి మైలేజ్ తీసుకువస్తుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది. 🎬 సాంకేతిక నిపుణులు: రచన, దర్శకత్వం: ఎంఎం నాయుడు నిర్మాత: సాయి సుధాకర్ కొమ్మాలపాటి బ్యానర్: విజన్ మూవీ మేకర్స్ సినిమాటోగ్రఫీ: ఎస్ హలేష్ ఎడిటర్: నహిద్ మహమ్మద్ సంగీతం: సుభాష్ ఆనంద్ డైలాగ్స్: బండారు నాయుడు పీఆర్వో: మధు విఆర్ డిజిటల్ మార్కెటింగ్: హౌస్ ఫుల్ మీడియా, డిజిటల్ దుకాణం 🎵 పాటల వివరాలు: పాట: సుమతి సుమతి లిరిక్స్: కృష్ణ మాదినేని గాయకుడు: గోల్డ్ దేవరాజ్ సంగీతం: సుభాష్ ఆనంద్ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ Watch Here Full Video









