రాజమహేంద్రవరంలో… శివరాత్రి ఏర్పాట్లు

alt="Jodugullu Sivalayam Shivaratri arrangements Rajahmundry"

శివరాత్రి ఏర్పాట్లపై హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి, రాజమహేంద్రవరం ( Samachara News):
రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల రక్షణ కోసం కృషి చేస్తున్న హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి సభ్యులు శివరాత్రి పండుగ ఏర్పాట్లను పరిశీలించారు. రాజమహేంద్రవరం నగరంలోని గోదావరి గట్టు రోడ్ వద్ద ఉన్న జోడుగుళ్ల శివాలయంలో శుక్రవారం ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపట్టారు.

జిల్లా అధ్యక్షులు వెలుగూరి రవికుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు, దుర్గా శక్తి మహిళా సభ్యులు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మౌళిని కలిసి సమితి ఉద్దేశాలను వివరించి, వినతిపత్రం అందజేశారు.

రేపటి మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే తక్షణమే సమితి స్పందిస్తుందని జిల్లా అధ్యక్షులు తెలిపారు. భక్తులకు సేవలందించేందుకు సమితి సభ్యులు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

ఈ సందర్భంగా సమితి గౌరవ అధ్యక్షులు, అన్నవరం దేవస్థానం విశ్రాంత ప్రధాన అర్చకులు ఇంద్రాగంటి గోపాలకృష్ణ అక్కడికి విచ్చేసిన 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శివగణేష్ను శాలువాతో సత్కరించారు. అలాగే జిల్లా అధ్యక్షుడు వెలుగూరి రవికుమార్, 7 ఐడియాస్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఉదయ్ భాస్కర్ను పుష్పగుచ్ఛంతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో

జిల్లా జనరల్ సెక్రటరీ పెరుమాళ్ల పవన్ కుమార్

కార్యదర్శి పోతుల వెంకటేష్,

మీడియా కో-ఆర్డినేటర్ అత్తులూరి కిషోర్,

ఉపాధ్యక్షులు మురళి, సాయికృష్ణ,

దుర్గా శక్తి టీమ్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

శివరాత్రి ఏర్పాట్లపై హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి చేపట్టిన ఈ పర్యవేక్షణతో భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News