“సుమతీ శతకం” చిత్రం నుంచి రెండో సాంగ్ విడుదల

alt="Amardeep Chaudhary Shaili Chaudhary Sumathi Shatakam song"

సుమతీ శతకం చిత్రానికి సంబంధించిన రెండవ పాట ‘సుమతి సుమతి’ తాజాగా విడుదలైంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్నారు. టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్పేట్ శైలజ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా విడుదలైన ‘సుమతి సుమతి…’ పాట ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ పాటకు కృష్ణ మాదినేని లిరిక్స్ అందించగా, గోల్డ్ దేవరాజ్ గానం ఆకట్టుకునేలా ఉంది. సుభాష్ ఆనంద్ సంగీతం పాటను మరింత వినసంపుడిగా మార్చింది.

నా కుట్టీ కుట్టీ సుమతీ, నా చిట్టీ చిట్టీ సుమతీ…” అంటూ సాగే ఈ పాటలో హీరో తన ప్రేమను సరదాగా, సింపుల్‌గా వ్యక్తపరిచిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అమర్దీప్–శైలి చౌదరి మధ్య కెమిస్ట్రీ, పాటలోని సింపుల్ కానీ ఫ్రెష్ డాన్స్ స్టెప్స్ యువతను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. ఈ పాట త్వరలోనే చార్ట్‌బస్టర్‌గా మారుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే విడుదలైన ‘ఎక్కడే ఎక్కడే’ పాటకు వచ్చిన స్పందనను దృష్టిలో ఉంచుకుంటే, ‘సుమతి సుమతి’ కూడా సినిమాకు మంచి మైలేజ్ తీసుకువస్తుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది.

🎬 సాంకేతిక నిపుణులు:

  • రచన, దర్శకత్వం: ఎంఎం నాయుడు

  • నిర్మాత: సాయి సుధాకర్ కొమ్మాలపాటి

  • బ్యానర్: విజన్ మూవీ మేకర్స్

  • సినిమాటోగ్రఫీ: ఎస్ హలేష్

  • ఎడిటర్: నహిద్ మహమ్మద్

  • సంగీతం: సుభాష్ ఆనంద్

  • డైలాగ్స్: బండారు నాయుడు

  • పీఆర్వో: మధు విఆర్

  • డిజిటల్ మార్కెటింగ్: హౌస్ ఫుల్ మీడియా, డిజిటల్ దుకాణం

🎵 పాటల వివరాలు:

  • పాట: సుమతి సుమతి

  • లిరిక్స్: కృష్ణ మాదినేని

  • గాయకుడు: గోల్డ్ దేవరాజ్

  • సంగీతం: సుభాష్ ఆనంద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Watch Here Full Video

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News