నన్ను రాజకీయాల్లోకి లాగకండి.. హీరో విశ్వక్ సేన్‌ పోస్ట్‌

‘లైలా’ ప్రీరిలీజ్‌ వేడుకలో నటుడు పృథ్వీ చేసిన రాజకీయ వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై విశ్వక్ సేన్‌, చిత్ర నిర్మాత సాహు గారపాటి ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. అయినా ’లైలా’కు వ్యతిరేకంగా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌లు మాత్రం ఆగడం లేదు. తాజాగా దీనిపై విష్వక్‌సేన్‌ మరోసారి స్పందించారు. తనను, తన సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దంటూ పోస్ట్‌ పెట్టారు. ఈ సినిమా పాట పోస్టర్‌లను విశ్వక్ సేన్‌ షేర్‌ చేశారు. ‘నా సినిమాకు సంబంధించిన ప్రతి పోస్టర్‌.. నా సినిమాకు సంబంధించింది మాత్రమే. సినిమాల పోస్టర్స్‌, పోస్ట్‌లను షేర్‌ చేసే ప్రతిసారీ రెండుసార్లు ఆలోచించలేను. ఈ ఫొటోలో ఉంది సోనూ మోడల్‌.. ఫిబ్రవరి 14న విూ ముందుకు వస్తున్నాడు అని అన్నారు.

ఇక ఎక్స్‌లో ట్రెండ్‌ అవుతోన్న బాయ్‌కాట్‌ లైలా హ్యాష్‌ట్యాగ్‌ గురించి మాట్లాడుతూ.. ‘ నేను ప్రతిసారీ తగ్గను. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో జరిగిన దానికి నిన్న మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాను. అతిగా ఆలోచించొద్దు. ప్రశాంతంగా ఉండండి. మళ్లీ చెబుతున్నాను.. నేను నటుడిని మాత్రమే. నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు‘ అని విశ్వక్ సేన్‌ చెప్పారు. విశ్వక్ సేన్‌ హీరోగా దర్శకుడు రామ్‌నారాయణ్‌ తెరకెక్కించిన చిత్రమే ’లైలా’ ఆకాంక్ష శర్మ హీరోయిన్‌. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈసందర్భంగా ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో.. తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ విశేషాలు చెబుతూ 150 మేకల్లో చివరకు 11 మిగిలాయని నటుడు పృథ్వీరాజ్‌ చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ సినిమాని బాయ్‌కాట్‌ చేయాలంటూ సోషల్‌ విూడియాలో ట్రెండ్‌ మొదలైంది. ఈ హ్యాష్‌ట్యాగ్‌తో ఇప్పటివరకూ లక్షా 50వేలకు పైగా పోస్ట్‌లు షేర్‌ అయ్యాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News