- ఖాతాదారులను హెచ్చరించిన ఎల్ఐసి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఫేక్ యాప్స్‌తో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి తన పాలసీదారులకు సూచించింది. తమ పేరు విూద నకిలీ యాప్స్ సర్క్యులేట్ అవుతున్నట్లు దృష్టికి రావడంతో తాజాగా పబ్లిక్ అడ్వైజరీని జారీ చేసింది. అలాంటి యాప్స్ వలలో పడొద్దని సూచించింది. ‘ఎల్ఐసీ ఇండియా పేరు విూద కొన్ని నకిలీ మొబైల్ అప్లికేషన్లు చెలామణి అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. కాబట్టి పాలసీహోల్డర్లు, కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలి.
ఎల్ఐసీ ఇండియా అధికారిక వెబ్సైట్, ఎల్ఐసీ డిజిటల్ యాప్, ఎల్ఐసీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఇతరమార్గాల ద్వారా లావాదేవీలు జరపాలి‘ అని సూచించింది. ఇతర మార్గాల ద్వారా చేసే చెల్లింపులకు ఎల్ఐసీ బాధ్యత వహించబోదని స్పష్టంచేసింది. ఎల్ఐసీ అధికారిక యాప్‌ను గుర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే.. వెబ్సైట్లోకి వెళ్లి సంబంధిత లింక్‌పై క్లిక్ చేసి విూకు కావాల్సిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. నకిలీ యాప్స్ అని గమనిస్తే ఫిర్యాదు చేయాలని సూచించింది.