ఆరోపణల నివృత్తి కోసం.. బిసి కుల సంఘాలతో సమావేశం

హైదరాబాద్, ఫిబ్రవరి 5: సమగ్ర కులగణన పైన వస్తున్న అనేక ఆరోపణల నివృత్తి కోసం బిసి డెడికేషన్ కమిటి బిసి కుల సంఘాలతో అఖిల పక్ష సమవేశం ఏర్పాటు చేయాలని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటీ అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ డిమాండ్ చేసారు. ఒక సామాజిక వర్గం జనభా ఎక్కువ చూపించడం, బిసిల జనాభా తక్కువ చూపించినట్టు నివేదికపైన ఆరోపణల ఉన్నాయని అన్నారు. దీనిపై గ్రామ స్థాయి వరకు బిసి కులాలు ఆందోళన చెందుతున్నారని అ పేర్కొన్నారు.బిసిల జనాభా 46 శాతంగా చూపించిన కమిటి నివేదిక, ఏ కుల జనాభా ఎంతో లెక్కలు చూపవలసిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ మొత్తం జనాభాలో తండాలు, ఆదివాసిలు, ముస్లిం, దళిత, ఓసిల జనాభా మినహాయిస్తే ప్రతి ఊరిలో బిసి కులాల జనాభానే ఎక్కువ అన్నారు.

ఏ ఊరిలో చూసిన 56 శాతం నుంచి 80 శాతం వరకు బిసిల జనాభానే ఉంటుందని చెప్పారు.అలాంటిది బిసిల జనాభా 46 శాతం నివేదిక రావడం పట్ల ,నివేదిక లో శాస్త్రియ లోపం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు.గతంలో సకల జనుల సర్వే లో 52శాతం బిసిల జనభా ఉంటే నేడు 46 శాతం రావడం పట్ల నివేదిక పైన నిరసనలు వ్యక్తం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సామాజిక అసామానతలకు, అసంతృప్తి కి దారి తీస్తున్నదని అన్నారు. వెంటనే డెడికేషన్ కమిటి కులాల వారిగా ఏ కుల జనాభా ఎంతో నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News