డిస్ట్రిబ్యూటర్‌ను పెళ్లి చేసుకున్న బిచ్చగాడు హీరోయిన్‌

కోలీవుడ్‌ హీరో విజయ్‌ ఆంటోనికి ఉన్న ఫాలోయింగ్‌ గురించి తెలిసిందే. వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విజయ్‌.. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, గాయకుడిగా తమిళ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. విజయ్‌ ఆంటోనీ కెరీర్‌ లో బిచ్చగాడు సినిమా చాలా స్పెషల్‌. ఈ మూవీని తెలుగులోకి డబ్‌ చేయగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాతోనే తెలుగు సినీప్రియులకు దగ్గరయ్యాడు విజయ్‌. డబ్బింగ్‌ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎన్నో రికార్డ్స్‌ క్రియేట్‌ చేసింది. ఇందులో సాట్నా టైటస్‌ హీరోయిన్‌గా నటించింది. మొదటి చిత్రంతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. ఈ సినిమాతో దక్షిణాదిలో చాలా ఫేమస్‌ అయిన సాట్నా.. ఆ తర్వాత యీథవన్‌, నీది నాదీ ఒకే కథ, తిట్టం పోట్టు తిరుదుర కూటం చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్‌ మంచి ఫాంలో ఉండగానే డిస్ట్రిబ్యూటర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది.

1991 నవంబర్‌ 28న కేరళలోని కొచ్చిలో జన్మించిన సాట్నా.. గ్రాడ్యుయేషన్‌ పూర్తికాగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. పిచ్చైక్కారన్‌ (తెలుగులో బిచ్చగాడు) సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా హిట్‌ కావడంతో సాట్నాకు వరుస ఆఫర్స్‌ క్యూ కట్టాయి. కానీ కెరీర్‌ మంచి ఫాంలో ఉండగానే బిచ్చగాడు సినిమాను తమిళంలో డిస్ట్రిబ్యూట్‌ చేసిన డిస్ట్రిబ్యూటర్‌ కార్తీతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్లకు వీరిద్దరు రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. వీరి పెళ్లిపై అప్పట్లో ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది. అప్పటికే ఒప్పుకున్న సినిమాలను వదిలేసి పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌ కు సిద్ధపడింది. ఈ దంపతులకు కిరణ్‌ కార్తిక్‌ అనే బాబు ఉన్నాడు. ప్రస్తుతం సాట్నా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News