కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలి

హైదరాబాద్, జనవరి 05: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథ కాలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని మౌలాలి డివిజన్ కార్పొరేటర్ గున్నాల సునీత శేఖర్ యాదవ్ సూచించారు.శనివారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగా హన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హజ రైన కార్పొరేటర్ మాట్లాడుతూ..ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతులకు 2025 ఆరంభంలోనే కొత్త సంవత్సరం కానుక అందచేశారన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన నిథి సంవత్స రానికి 10 వేలకు పెంచడం హర్షనీయమన్నా రు. కేంద్ర ప్రభుత్వం గతంలో రైతులకు 3 విడుతలుగా రూ 6,000 ఆర్థిక సహాయం అందచేసి భరోసా కల్పించిందన్నారు.

రైతుల సాధక బాధలను అర్థం చేసుకున్న మోదీ, ఈ ఏడాది నుంచి రైతులకు మరింత భరోసా కల్పిస్తూ రూ 10,000 లకు పెంచడంతో దేశ వ్యాప్తంగా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నా రని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీకి రైతుల తరుపున కార్పొరేటర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. అదే విధంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చొరవ, ప్రత్యేక శ్రద్దతో సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి శామీర్ పేట, మేడ్చల్ వరకు మెట్రో రైలు లైన్ పొడగింపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల నగర ప్రజలు ప్రధాని నరేంద్రమోడీ, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కృషిని అభినందిస్తూ హార్షం వ్యక్తం చేస్తున్నారని కార్పొరేటర్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం మొట్ట మొదట మౌలాలి డివిజన్ లో నిర్వహించటం జరగడం తనకి చాలా సంతోషంగా ఉందని, ఈ విషయంలో ఆర్థిక వేత్త సాయిప్రసాద్ లాంటి మేధావుల సలహాలు, సూచనలు ఎంతో అవశ్యమన్నారు. ఆయనతో ప్రతి శనివారం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కేంద్ర సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించ నున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా వాళ్ళకి రుణాలు వచ్చేవరకు తమ వంతు సహయ సహాకారాలు ఉంటాయని కార్పొరేట ర్ చెప్పారు. అంతకు ముందు ఆర్థిక వేత్త, చార్టెడ్ అకౌంటెంట్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చక్కగా వివరించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర పథకాలకు ఎవరెవరు అర్హులు..? వాటికి ఏ విధంగా దర ఖాస్తు చేసుకోవాలి.. వాటిని ఎలా పొందవచ్చు..? అనే అంశాలను ఆయన వివరించా రు. ఈ కార్యక్రమంలో బీజేపీ మల్కాజిగిరి సీనియర్ నాయకుడు గున్నాల చంద్రశేఖర్ యాదవ్, మౌలాలి డివిజన్ అధ్యక్షుడు అని పెద్ది సాయిబాబు, బబిత, అలివేలు, శేఖర్, రమణ, ప్రసాద్,సాయిబాబు, సంధ్య, లత, మోహన్ రావు, పాషా, మసూద్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News