బస్సు ప్రయాణాన్ని సులభతరం చేసే.. ‘TGSRTC గ‌మ్యం’ యాప్‌

ప్రజలకు చేరువయ్యేందుకు టీజిఎస్ఆర్టీసీ మరో ముందుడుగు వేసింది. ఈ క్రమంలోనే బస్సు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, “TGSRTC గమ్యం” బస్ ట్రాకింగ్ యాప్‌ను ప్రారంభించింది. అనంతరం గమ్యం యాప్ సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. అనంతరం యాప్‌ను ప్రారంభించిన తర్వాత, TGSRTC మేనేజింగ్ డైరెక్టర్ VC సజ్జనార్ మాట్లాడుతూ.. రెండేళ్లుగా ప్రజలకు ప్రజా రవాణా వ్యవస్థను దగ్గర చేసేందుకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు టీజిఎస్ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టిందని సజ్జనార్ తెలిపారు. అంతేగాక గమ్యం యాప్ ప్రయోజనాలను వివరిస్తూ అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే.. టీజీఎస్ఆర్టీసీ బస్సుల సమాచారన్నంతా తెలుసుకోవచ్చని సజ్జనార్ తెలిపారు.

అంతేగాక టీజిఎస్ఆర్టీసీకి చెందిన 4,170 బస్సులకు ట్రాకింగ్ సదుపాయం కల్పించాం. హైదరాబాద్ లోని పుష్ఫక్ ఎయిర్ పోర్ట్, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులకు ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అదే విధంగా జిల్లాల్లో పల్లె వెలుగు మినహా అన్ని బస్సులకు ఈ సదుపాయం ఉందన్నారు. ఇకపై ఈ గమ్యం యాప్ ద్వారా స్టార్టింగ్ నుంచి గమ్యస్థానం వరకు ఏఏ బస్సులు ఏఏ సమయాల్లో అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. డ్రైవర్, కండక్టర్ వివరాలు అందులో కనిపిస్తాయి. సిటీ బస్సులకు రూట్ నంబర్ ఎంటర్ చేసి బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు అన్నారు.

అంతేగాక అత్యవసర సమయంలో బస్సు బ్రేక్ డౌన్, వైద్య సహాయం, రోడ్డు ప్రమాదం, తదితర వివరాలను ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిపోర్ట్ చేయొచ్చన్నారు. ‘TGSRTC Gamyam’ పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉందని, టీజీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ http://tgsrtc.telangana.gov.in నుంచి ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎండీ సజ్జనారా తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News