హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలిశారు. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కూడా హాజరయ్యారు. తెలంగాణలో ఆరు డేటా కేంద్రాలను ఏర్పాటు చేయనున్న మైక్రోసాఫ్ట్ ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చలు జరిగాయి. మైక్రోసాఫ్ట్ నుంచి రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి ముఖ్యమంత్రి సత్య నాదెళ్లను ఆహ్వానించారు. సమావేశంలో స్కిల్ యూనివర్సిటీ, ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది.










