రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఈ క్రమంలోతెలంగాణ పోలీస్ కొత్త లోగోను పోలీస్ శాఖ విడుదల చేసింది. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా తెలంగాణ పోలీస్ ఖాతాలో కొత్త లోగోను పోస్ట్ చేసింది. గత లోగోలో ఉన్న తెలంగాణ స్టేట్ పోలీస్ తొలగించి.. తెలంగాణ పోలీస్ అనే పేరుతో కొత్త లోగోను విడుదల చేసింది. గత లోగోలో కేవలం స్టేట్ అనే పదాన్ని తొలగించి కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించింది. దీంతో పోలీస్ శాఖ అధికారిక చిహ్నం తెలంగాణ స్టేట్ పోలీస్ నుంచి తెలంగాణ పోలీస్ గా మారింది.
