టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయన థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతకాలంగా ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఇటీవలే ఆయన ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకున్నారు. వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
