అల్లు అర్జున్ ఇంటిపై దాడిని సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశిస్తూ ట్వీట్ చేశారు.
