నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం రేపుతోంది. మర్రిపాడు మండలంలోని ఓ గ్రామంలో ఏడేళ్ల బాలుడికి వారం రోజుల క్రితం ఫిట్స్ వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలుడికి ఏదో వైరస్ సోకినట్లుగా అనుమానిస్తూ వెంటనే చెన్నైకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. బాలుడు ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
