ములుగు జిల్లా బోదాపురం గ్రామంలో పెద్దపులి కలకలం రేపుతోంది. గ్రామ పరిసరాల్లో పులి అరుపులు వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పులి పాదముద్రలు కనిపించడం ద్వారా పెద్దపులి అక్కడ ఉన్నట్టు గుర్తించారు. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. గ్రామ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని అటవీశాఖ అధికారులు సూచించారు.










