మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య గొడవ నేపథ్యంలో మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చారు. ఈ క్రమంలో మోహన్ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లు చేరుకున్నారు. విష్ణు తరుపున 40 మంది బౌన్సర్లు, మనోజ్ తరుపున 30 మంది బౌన్సర్లు మోహన్ బాబు నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే మనోజ్ ను సపోర్ట్ చేసేందుకు గబ్బర్ సింగ్ టీమ్ రంగంలోకి దిగింది.
