మల్లారెడ్డికి హైడ్రా అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. జవహర్ నగర్ యాప్రల్లో ఆయన అనుచరుడు అక్రమంగా నిర్మించిన డీఎన్ఆర్ ఫంక్షన్ హాల్‌ను అధికారులు కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో నాలాపై అక్రమంగా ఫంక్షన్ హాల్ నిర్మించినట్లు గుర్తించిన హైడ్రా అధికారులు జేసీబీ సహాయంతో ఫంక్షన్ హాల్ ప్రహరీ గోడతో పాటు ఫంక్షన్ హాల్‌ను నేలమట్టం చేశారు. సర్వే నంబర్ 14లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సైతం కబ్జా చేసి నిర్మాణం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కూల్చివేత ప్రాంతంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
