హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అపరిచిత నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌పై ప్రజలను అప్రమత్తం చేశారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, కొన్ని అంతర్జాతీయ నంబర్ల ద్వారా సైబర్ మోసాలు జరుగుతున్నాయని హెచ్చరించారు.
ప్రధానంగా +94777 455913, +37127913091, +56322553736, +37052529259, +255901130460 వంటి నంబర్ల నుంచి ఫోన్ వస్తే ఎత్తరాదని సూచించారు.
ఈ నంబర్లు +371 (లాత్వియా), +375 (బెలారస్), +381 (సెర్బియా), +563 (లోవా), +370 (లిథువేనియా), +255 (టాంజానియా) వంటి కోడ్లతో మొదలవుతాయి. ఈ నంబర్లు కేవలం ఒకసారి రింగ్ చేసి, కట్ చేస్తాయి. తిరిగి ఫోన్ చేస్తే, మీ మొబైల్ డేటా, కాంటాక్ట్‌ల జాబితా, బ్యాంకింగ్ మరియు క్రెడిట్ కార్డు వివరాలు కేవలం మూడు సెకన్లలో కాపీ చేసుకునే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు.