పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామానికి చెందిన మొగురం గాయత్రి ఏపీలో సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. అక్కడి హైకోర్టు నిర్వహించిన పరీక్షల్లో రెండోసారి పరీక్ష రాసిన గాయత్రి.. ఈనెల 27న వెలువడిన ఫలితాల్లో సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. వడ్కాపూర్ గ్రామానికి చెందిన మొగురం మొండయ్య, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు గాయత్రి ఉన్నారు. తండ్రి వ్యవసాయ కూలీగా గ్రామంలోనే పనిచేస్తున్నారు.
