భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతుల మీదుగా ‘అగ్లీ స్టోరీ’

ప్రేమలోని చీకటి కోణాన్ని ఉత్కంఠభరితంగా చూపించే రొమాంటిక్ థ్రిల్లర్ ‘అగ్లీ స్టోరీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను సాగర్ కె చంద్ర ఘనంగా విడుదల చేశారు. ‘భీమ్లా నాయక్’ చిత్ర దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన సాగర్ కె చంద్ర చేతుల మీదుగా విడుదలైన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో నందు మరియు అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ట్రైలర్ చూస్తుంటే ప్రేమ, మోసం, భావోద్వేగాలు, ఉత్కంఠల మేళవింపుగా సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇంటెన్స్ నెరేషన్, సస్పెన్స్ ఎలిమెంట్స్, ఊహించని ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

ప్రత్యేకంగా సంగీత దర్శకుడు శ్రవణ్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మరింత బలం చేకూర్చింది. రియా జియా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు కూడా ఎంతో రిచ్‌గా కనిపిస్తున్నాయి. ప్రేమ కథలోని భావోద్వేగాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిళితం చేస్తూ దర్శకుడు ప్రణవ స్వరూప్ సినిమా రూపొందించినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.

దర్శకుడు ప్రణవ స్వరూప్ మాట్లాడుతూ — “ప్రతి ప్రేమ కథకు ఓ చీకటి కోణం ఉంటుంది. అదే అంశాన్ని బలంగా చూపించాలనుకున్నాం. నందు, అవికా ఇద్దరూ అద్భుతంగా నటించారు. నిర్మాతలు సుభాషిణి గారు, లక్ష్మణ్ గారు సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడలేదు” అని తెలిపారు.

హీరో నందు మాట్లాడుతూ — “ఈ పాత్ర నాకు కొత్త అనుభవం. కథలో ఉన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అవికా అద్భుతమైన నటన కనబరిచింది” అన్నారు.

హీరోయిన్ అవికా గోర్ మాట్లాడుతూ — “ప్రేమలోని వాస్తవాలను చూపించే ప్రయత్నం చేశాం. ఈ సినిమాలో అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులు మే 22న థియేటర్లలో ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను” అని తెలిపారు.

నిర్మాతలు సుభాషిణి మరియు కొండా లక్ష్మణ్ మాట్లాడుతూ సినిమా ఔట్‌పుట్‌పై పూర్తి నమ్మకం ఉందన్నారు. అలాగే ఈ ప్రాజెక్టుకు సహకరించిన నిర్మాత బెక్కం వేణుగోపాల్‌కు, ట్రైలర్ విడుదల చేసిన సాగర్ కె చంద్రకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ చిత్రంలో రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా, ప్రజ్ఞా నయన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మే 22న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.

  • నందు
  • అవికా గోర్
  • రవితేజ మహాదాస్యం
  • శివాజీ రాజా
  • ప్రజ్ఞా నయన్
  • బ్యానర్ : రియా జియా ప్రొడక్షన్స్
  • నిర్మాతలు : సుభాషిణి, కొండా లక్ష్మణ్
  • కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : ప్రణవ స్వరూప్
  • కెమెరా : శ్రీసాయికుమార్ దారా
  • సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
  • ఎడిటింగ్ : శ్రీకాంత్ పట్నాయక్
  • PRO : మధు VR
  • డిజిటల్ మీడియా : వారే మీడియా, డిజిటల్ దుకాణం

    Click More Updates….

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News