రాజమండ్రి నగరంలో సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 25వ డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు అందజేశారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, విధవులు తదితర లబ్ధిదారులు ఈ ముందస్తు పంపిణీ పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో.. బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ పెరుమాళ్ల పవన్ కుమార్, ఓబీసీ మోర్చా జోనల్ ఇంచార్జి కురగంటి సతీష్, ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రెసిడెంట్ తవ్వ రాజా, టీడీపీ వార్డ్ ప్రెసిడెంట్ జైరామ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే కూటమి నాయకులూ కొండ బాబు, రుక్కు, శ్రీనివాస్, బబ్బ్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
పెన్షన్ల పంపిణీ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ — ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి సకాలంలో చేరాలనే ఉద్దేశంతోనే ఈ ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి నెల పెన్షన్ జీవనాధారంగా మారిందని పేర్కొన్నారు.
లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి లేదా వార్డు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా పెన్షన్లు అందజేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది సమన్వయంతో పని చేశారని నిర్వాహకులు తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు.
రాజమండ్రి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంతో 25వ డివిజన్‌లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసం మరింత పెరిగిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేలా పని చేస్తామని నాయకులు తెలిపారు.









