బలగం వేణు.. ఎల్లమ్మకు సర్వం సిద్దం

బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్‌ హిట్‌ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 లో విడుదలైన ఈ సినిమా ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురిపించింది . వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్‌ అయి చాలా కాలం అవుతున్నా కూడా మరో సినిమాను పట్టాలెక్కించలేదు ఈ దర్శకుడు. బలగం సినిమాను నిర్మించిన దిల్‌ రాజు బ్యానర్‌ లోనే తన రెండవ సినిమా చేయాల్సి ఉంది.అయితే ఈ కథ అందరి చుట్టూ తిరిగి ్గªనైల్‌ గా యంగ్‌ హీరో నితిన్‌ దగ్గరకు వచ్చి చేరింది.

పలు మార్పులతో మొత్తానికి ఈ సినిమా అక్కడ ఓకే అయింది. ఈ కథకు నిర్మాత దిల్‌ రాజు ఇప్పటికే యల్లమ్మ అనే టైటిల్‌ ను రిజిస్టర్‌ చేసి ఉంచారు. ప్రస్తుతం నితిన్‌ చేస్తున్నరాబిన్‌ హుడ్‌, తమ్ముడు సినిమాలు చివరి దశ షూట్‌ లో ఉన్నాయి. ఇక ఇప్పుడు వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ సినిమాను సెట్స్‌ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు నితిన్‌. కాగా ఈ సినిమాను ఫిబ్రవరి ఎండిరగ్‌ లేదా మార్చ్‌ లో ముహూర్తం పూజ ఉండనుందట. ఏప్రిల్‌ లేదా మే నుండి షూటింగ్‌ మొదలు కానుంది. నితిన్‌ ను సరికొత్తగా చూపించేందుకు కొత్త మెకోవర్‌ ట్రై చేస్తున్నాడు దర్శకుడు వేణు యెల్డండి. దాదాపు రెండేళ్లుగా ఈ కథ విూద కసరత్తులు చేస్తున్న వేణు ఈ సినిమాతో నితిన్‌ కు ఎంత పెద్ద హిట్‌ ఇస్తాడో చూడాలి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News