దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి

ఇండస్ట్రీలో చాలా మంది ఓవర్‌ నైట్‌ లో స్టార్స్‌ గా మారిపోయారు. కొంతమంది స్టార్‌ డమ్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో దూసుకుపోతున్నారు. కొంతమంది కొన్ని సినిమాలతోనే కనిపించకుండా పోయారు. ఇక మరికొంతమంది వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే చాలా మంది భామలు వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ అదృష్టం కలిసి రాక హిట్స్‌ అందుకోలేకపోతున్నారు. మరికొంతమంది మాత్రం హిట్స్‌ తో దూసుకుపోతున్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ 4 నెలల్లో 3 హిట్లు అందుకుంది. అంతే కాదు ఆ సినిమాలు 850 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టాయి ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఇప్పుడు స్టార్‌ హీరోలు కూడా ఆమె డేట్స్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.? ఆమె ఎవరో కాదు ఇప్పుడు టాలీవుడ్‌ లో ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తుంది. ఆ భామ ఎవరో కాదు లేటెస్ట్‌ సెన్సేషన్‌ మీనాక్షి చౌదరి. మీనాక్షి చౌదరి ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ.. బిజీగా మారింది.

అక్కినేని హీరో సుశాంత్‌ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. రవితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. ఇక బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళ్‌ లోనూ సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. తమిళ్‌ లో రీసెంట్‌ గా విజయ్‌ గోట్‌ సినిమాలో నటించింది. తెలుగులో వరుస హిట్స్‌ అందుకుంది. 4 నెలల్లో 3 హిట్లు అందుకుంది ఈ చిన్నది. గత నాలుగు నెలల్లో మూడు హిట్స్‌ అందుకుంది ఈ చిన్నది. విజయ్‌ హీరోగా వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈసినిమా 450 కోట్లకు వసూల్‌ చేసింది. ఈ సినిమాలో మీనాక్షి హీరోయిన్‌ గా చేసింది. మీనాక్షి హిట్‌ లిస్ట్‌లో చేరిన చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.బాక్సాఫీస్‌ దగ్గర రూ.100 కోట్ల వరకు రాబట్టింది. సంక్రాంతి కానుకగా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది మీనాక్షి సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యింది. ఈ సినిమా ఏకంగా రూ. 300కోట్లకు పైగా వసూల్‌ చేసింది. ఇలా గత నాలుగు నెలల్లో మూడు హిట్స్‌ అందుకుంది ఈ చిన్నది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News