ఆకట్టుకుంటున్న పరదా ఫస్ట్‌ లుక్‌

అనుపమ పరమేశ్వరన్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘పరదా’. మలయాళ నటి దర్శన, సంగీత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా బండి ఫేం ప్రవీణ్‌ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీధర్‌ మక్కువ, విజయ్‌ డొంకాడ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌తోపాటు టీజర్‌ను కూడా విడుదల చేయగా.. మంచి స్పందన వస్తోంది. కాగా ఈ సినిమా మలయాళ వెర్షన్‌కు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీ మలయాళ థ్రియాట్రికల్‌ హక్కులను పాపులర్‌ మాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ దుల్కర్‌ సల్మాన్‌ సొంతం చేసుకున్నాడు. హోంబ్యానర్‌ వేఫరెర్‌ ఫిలిమ్స్‌లో పరదా చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మిస్టికల్‌ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రం సంప్రదాయపు కట్టుబాట్లు మహిళలను ఎలా అణచివేస్తున్నాయి. ఎలా ఎదగకుండా అణగదొక్కుతున్నాయి.. వాటిని దాటి మహిళలు ఎలా ఎదుగుతున్నారు అనే కాన్సెప్ట్‌ తో రాబోతున్నట్లు టీజర్‌ హింట్‌ ఇచ్చేస్తుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News