ఎపిలో.. పెరిగిన రిజిస్టేష్రన్‌ ఛార్జీలు

  • రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద రద్దీ

అమరావతి, జనవరి 30: రిజిస్టేష్రన్‌ విలువల సవరణ జరగడంతో, ఏపీలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రిజిస్టేష్రన్‌ ఛార్జీలు పెరుగనున్నాయి. దీంతో. రాష్ట్ర వ్యాప్తంగా గ్రావిూణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్టేష్రన్‌ విలువల సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీలోని రిజిస్టేష్రన్‌ కార్యాలయాల వద్ద రద్దీ నెలకొంది. గుంటూరులో రాత్రయినా రిజిస్టేష్రన్ల పక్రియ కొనసాగుతోంది.మార్కెట్‌ విలువకు అనుగుణంగా రిజిస్టేష్రన్‌ విలువలు సవరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సవరించిన విలువలు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్టేష్రన్ల శాఖ కమిషనర్‌ను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదేశించారు.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పట్టణ, గ్రావిూణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల రిజిస్టేష్రన్‌ విలువల పెంపు, తగ్గింపు చేసే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఏడాది ఆగస్టు 1న, గ్రావిూణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి రిజిస్టేష్రన్‌ విలువలు, స్టక్చర్ర్‌ విలువలను సవరించాలి. కానీ వైకాపా ప్రభుత్వం ప్రత్యేక రివిజన్‌ పేరుతో విలువలను పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపింది. వీటిపై సవిూక్షించిన కూటమి ప్రభుత్వం రిజిస్టేష్రన్‌ విలువలను సవరించాలని నిర్ణయించింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News