ఆప్‌ నేత కేజ్రీవాల్‌ తీరుపై మండిపడ్డ మోదీ

న్యూఢిల్లీ, జనవరి 29: ప్రధాని తాగే నీళ్లలో హరియాణాలోని భాజపా ప్రభుత్వం విషం కలుపుతుందా..? అని మోడీ ప్రశ్నించారు. యమునా నదిని ఉద్దేశపూర్వకంగా హరియాణా విషపూరితం చేస్తోందంటూ ఆప్‌ అధినేత అరవింద్‌ కేజీవ్రాల్‌ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దిల్లీ ఎన్నికల వేళ.. ఈ వ్యాఖ్యలు ఆప్‌, హరియాణాలోని భాజపా ప్రభుత్వానికి మధ్య వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమ్‌ఆద్మీపార్టీ పై ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ‘దిల్లీ మాజీ ముఖ్యమంత్రి హరియాణా ప్రజలపై అసహ్యకరమైన ఆరోపణలు చేశారు. ఓటమి భయంతో ’ఆపద’ (ఆప్‌) నేతలు ఆందోళన చెందుతున్నారు. హరియాణా, దిల్లీలో నివసించే ప్రజలు ఒకరు కాదా..? హరియాణా ప్రజల బంధువులు దేశ రాజధానిలో లేరా..? తమ సొంత ప్రజలు తాగే నీటిని విషపూరితం చేస్తారా..? హరియాణా పంపుతున్న నీరు దిల్లీలో ప్రతిఒక్కరు వినియోగిస్తున్నారు.

అందులో ఈ ప్రధాని కూడా ఉన్నారు‘ అని కేజీవ్రాల్‌ వ్యాఖ్యలను మోదీ (ఓనీటతి) తీవ్రంగా ఖండించారు. అలాగే దిల్లీలో కాంగ్రెస్‌, ఆప్‌ పాలనపై విమర్శలు చేశారు. ‘ఆ రెండు పార్టీలు 25 సంవత్సరాలు దిల్లీని పాలించాయి. కానీ ప్రజల సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. ట్రాఫిక్‌ జామ్స్‌, నీళ్లు నిలవడం, కాలుష్యం.. ప్రతి సమస్యా అలాగే ఉంది. విూ ఓటు మాత్రమే వీటి నుంచి విముక్తి కలిగించగలదు. 11 ఏళ్లపాటు పెండిరగ్‌లో ఉన్న పనులను పూర్తిచేయాలి 25 సంవత్సరాల భవిష్యత్తు ప్రణాళికను వేయాలి. 25 సంవత్సరాలు ఆ రెండు పార్టీల పాలన చూశారు. ఇప్పుడు కమలానికి ఓ అవకాశం ఇవ్వండి‘ అని ఓటర్లను కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News