15 ఏళ్లలో తొలిసారి నాకు ఎంతో ఇష్టమైన దర్శకుడి సినిమా వేడుకకు ఆహ్వానం వచ్చిందని అన్నారు హీరోయిన్ తాప్సీ. తాజాగా ఆమె ‘బ్యాడ్‌గర్ల్’ అనే చిత్ర టీజర్ లాంచ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుక చెన్నైలో జరిగింది. మరి తాప్సీ చెబుతున్న ఆ ఇష్టమైన దర్శకుడు ఎవరు? ఏంటా కథ? అనే విషయంలోకి వస్తే.. బాలీవుడ్ దర్శక నటుడు అనురాగ్ కశ్యప్, కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యాడ్‌గర్ల్’. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చెన్నై నగరంలో జరిగిన వేడుకలో విడుదల చేశారు. గ్రాస్‌రూట్ ఫిల్మ్ కంపెనీ పతాకంపై తెరకెక్కిన ఈ మూవీకి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది స్వరాలు సమకూర్చారు.
ఈయన తమిళ చిత్రానికి సంగీతం అందించడం ఇదే తొలిసారి. దర్శకుడు వెట్రిమారన్ వద్ద ‘వడ చెన్నై’, ‘విచారణై’ వంటి సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన వర్షా భరత్ ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ‘కమింగ్ ఆఫ్ ఏజ్ ఫ్యామిలీ డ్రామా’గా రూపొందిన ఈ మూవీలో ప్రధాన పాత్రను అంజలి శివరామన్ పోషించగా.. శాంతిప్రియ, హృద్ హారూన్, టీజే అరుణాచలం, శరణ్య రవిచంద్రన్ తదితరులు ఇతర పాత్రలలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా తుదిదశ చిత్రీకరణ జరుపుకుంటోంది.