ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్న ప్రైవేటు పాఠశాలల..

  • యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • ఎల్బీనగర్ సిఐకి వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ రెడ్డి

హైదరాబాద్, జనవరి 21: కళాశాలలు, కార్పొరేట్ విద్యాసంస్థల నిర్వాహకులతో పాటు సిబ్బంది ఫీజుల విషయంపై విద్యార్థులను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ సిఐ వినోద్ కుమార్, ఎస్సై శేఖర్ రెడ్డి లకు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ రెడ్డి. లింగోజిగూడ డివిజన్ లోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో 7 వేల రూపాయల ఫీజు చెల్లించలేదని పరీక్ష రాయనీయకుండా ఆరుబయట కూర్చోబెట్టిన సంఘటనను స్థానిక కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడంతో స్పందించిన కార్పొరేటర్ వెంటనే పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపాల్ తో మాట్లాడి పరీక్ష రాసే విధంగా కృషి చేశారని ఆయన తెలిపారు. ఇకముందు కార్పొరేట్ విద్యాసంస్థలు కళాశాలలో విద్యార్థులను ఫీజు విషయంలో వేధించవద్దని వారి తల్లిదండ్రులను పిలిచి ఫీజు అడగాలని వారు కోరారు. తక్షణమే పిల్లలను బయట కూర్చోబెట్టిన సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని సిఐని కోరినట్లు తెలిపారు. సిఐ సానుకూలంగా స్పందించి ఫీజుల విషయంలో విద్యార్థులను వేధిస్తున్న సిబ్బంది పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్సం శ్రీధర్ గౌడ్, శ్రీనాథ్ రావు, రోహిత్, నరేందర్ పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News