కేరళ విపత్తులపై సర్కార్‌ కీలక నిర్ణయం

కేరళ, జనవరి 15: కేరళలోని వయనాడ్‌లో గతేడాది సంభవించిన ఘోరవిపత్తు ఘటనపై పినరయి విజయన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో గల్లంతైన వారిని మృతులుగా ప్రకటించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో విపత్తులో గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరుతుందని, పరిహారం అందించేందుకు సహాయపడుతుందని అభిప్రాయపడిరది. మిస్‌ అయిన వ్యక్తుల జాబితాను పరిశీలించేందుకు రెవెన్యూ శాఖ అధికారులతో సహా స్థానిక, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. ఈ కమిటీ విపత్తులో తప్పిపోయిన వారి జాబితాను తయారు చేసి పరిశీలన కోసం జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీకి సమర్పిస్తుంది.

డీడీఎమ్‌ఏ ఆ జాబితాను పరిశీలించి రాష్ట్ర స్థాయి కమిటీకి పంపితే.. అక్కడి నుంచి ఆ జాబితా ప్రభుత్వానికి చేరుతుంది. ఈ జాబితాలో పేర్లు ఉన్నవారిని ప్రభుత్వం మృతులుగా ప్రకటించి.. వారి బంధువులకు పరిహారం అందిస్తుంది. కాగా, గతేడాది జులై 30న వయనాడ్‌లో ఘోర ప్రకృతి విపత్తు సంభవించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. ఈ ఘటనలో సుమారు 263 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. మరో 35 మంది మిస్సయ్యారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News