- వైరల్ అవుతున్న నాగార్జున పోస్టు
టాలీవుడ్‌లో ఉన్న ప్రముఖ స్టూడియోస్‌లలో అన్నపూర్ణ స్టూడియోస్ ఒకటి. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ స్టూడియో నేటికి 50 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏఎన్‌ఆర్ కొడుకు నాగార్జున ప్రత్యేక వీడియోను విడుదల చేశాడు. 50 ఏండ్ల క్రితం సంక్రాంతి నాడు ఈ స్టూడియో స్టార్ట్ అయినట్లు వీడియోలో పంచుకున్నాడు. ’’రోడ్లు కూడా లేని టైంలో నాన్నగారు హైదరాబాద్‌కి వచ్చి ఇదంతా ఎలా స్థాపించారో నాకు ఇప్పటికి అర్థం కాదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఎంతోమంది టెక్నీషియన్స్ కొత్త ఆర్టిస్ట్‌లు కొత్త కొత్త దర్శకులు ఇండస్ట్రీకి వచ్చారు. ఎంతో మందికి ఉపాధి కలిగించింది అన్నపూర్ణ స్టూడియోస్. ఈ స్టూడియోస్ ప్రారంభించి నేటీకి 50 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిపాడు. సంక్రాంతి పండుగరోజు ఈ స్టూడియో ప్రారంభం కాగా.. ప్రతి సంక్రాంతికి ఇక్కడకు వచ్చి అందరితో టిఫిన్ చేయడం ఆనవాయితీగా వస్తుందని ఇప్పుడు కూడా అది కొనసాగుతుందని నాగార్జున తెలిపాడు.