- ట్వీటర్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్‌కు సెటైర్లు
హైదరాబాద్, జనవరి 10: తెలంగాణకు ఎంత మంది సీఎంలు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ గానీ, రేవంత్‌రెడ్డి గానీ ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే.. ఇంకో అర డజన్ మంది ఫ్రీగా వచ్చారు..! ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం అని కేటీఆర్ పేర్కొన్నారు. 1ఫ్లస్6 ఆఫర్ సీఎం వ్యవస్థని స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పడు చూడలేదెమో అని కేటీఆర్ సెటైర్లు వేశారు. వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజా పాలన కాబట్టి ప్రజలకి మీ అనుముల సీఎంలలో ఎవరు కావాలో ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచన చేశారు. సీఎం ఎంపిక కోసం ఐవీఆర్‌ఎస్ పద్ధతి పెడితే బాగుంటుందేమో చూడండి అని రేవంత్ రెడ్డికి ఒక చిన్న విన్నపం చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.