భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా దర్శకత్వంలో వచ్చిన ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్ట్‌వల్స్‌లో సత్తాచాటిన విషయం తెలిసిందే. ఇప్పటికే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు గోల్డెన్ గ్లోబ్స్ పురస్కారాలకు నామినేట్ అయిన ఈ చిత్రం తాజాగా బాఫ్టా (బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) అవార్డులలో కూడా సత్తా చాటింది. బాఫ్టా 2025లో ఉత్తమ దర్శకుడి విభాగంతో పాటు బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, బెస్ట్ ఫిల్మ్ నాట్ ఇన్ ఇంగ్లీష్ విభాగాల్లో ఈ చిత్రం నామినేట్ అయ్యింది. ఈ విషయాన్ని బాఫ్టా అధికారికంగా ప్రకటించింది.
విజేతల జాబితాను ఈ నెల 15న వెల్లడించనున్నారు అకాడమీ నిర్వహాకులు. ముంబయి నర్సింగ్ హోమ్‌లో పనిచేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సుల కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం గతేడాది జరిగిన ప్రతిష్ఠాత్మక 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకుంది. మరోవైపు ఈ సినిమాను చూసిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసలు కురిపించాడు. మరోవైపు ఈ చిత్రం డిస్నీహాట్ స్టార్ వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.