- సకాలంలో మంటలు ఆర్పడంతో తప్పిన ముప్పు
హైదరాబాద్, డిసెంబర్ 31: హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజరాజేశ్వరీ కాలనీ గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని 9వ అంతస్తులో ఉన్న ఫ్లాట్ లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో ప్లాట్‌లో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండాపూర్‌లోని గేలక్సీ అపార్ట్‌మెంట్స్ 9వ అంతస్తులో మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
మహిళ బాల్కనీలో ఉండటంతో ప్రమాదం తప్పింది ఇంట్లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి మంటలు వ్యాపించాయి. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎగిసిపడుతున్న మంటలను చూసి భయభ్రాంతులకు గురై ఇంట్లో ఉన్నవారు కిందకు వచ్చేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. . ఘటనస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు.
ఇదిలావుంటే హైదరాబాద్‌లోని బాలాపూర్ పరిధిలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బిస్మిల్లా కాలనీలోని ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళలనకు గురయ్యారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. పక్కనున్న వారిని అక్కడ నుంచి దూరంగా పంపించి వేస్తున్నారు.