- ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా
హైదరాబాద్, డిసెంబర్ 31: హైదరాబాద్ ఖాజాగూడ భగీరథమ్మ చెరువులోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కుల్చివేస్తున్నారు ఖాజాగూడా భగీరధమ్మ చెరువు ఆక్రమమణలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఇటీవలే భగీరథమ్మ చెరువులోని ఆక్రమణలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ క్రమంలో డిసెంబర్ 31న బఫర్ జోన్ లో ఏర్పాటు చేసిన షెడ్ లు, ఆక్రమణలను కూల్చివేసింది. నాలుగు ఎకరాల్లో ఆక్రమంగా వేసిన ఫెన్సింగ్‌ను హైడ్రా సిబ్బంది తొలగించారు. 20కి పైగా దుకాణాలను తొలగించారు. నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగిస్తోంది.