నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ – నెట్ (UGC-NET) డిసెంబర్ 2024 పరీక్ష అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. అభ్యర్థులు యూజీసీ నెట్ 2024 డిసెంబర్ పరీక్ష అడ్మిట్ కార్డ్‌ను అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.ac.in లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులపై మీ ఫొటో, బార్‌కోడ్, క్యూఆర్ కోడ్‌ను చెక్ చేసుకోండి. వీటిలో ఏది లేకపోయినా మరోసారి డౌన్ లోడ్ చేసుకోవాలని యూజీసీ సూచించింది.










