విజయవాడ వజ్ర గ్రౌండ్స్‌లో రామ్ చరణ్ 256 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డును సృష్టించారు. ఈ కటౌట్‌ను గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ సందర్భంగా రామ్ చరణ్ తన యువశక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ ఘనమైన ఈవెంట్లో హెలికాప్టర్ ద్వారా కటౌట్ పై పూలవర్షం కురిపించడం విశేషం. ఈ కార్యక్రమంలో గేమ్ ఛేంజర్ చిత్రానికి చెందిన నిర్మాత దిల్ రాజు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని కటౌట్‌ను ఆవిష్కరించారు.
ఈ ప్రతిష్టాత్మక ఘట్టానికి ప్రపంచ స్థాయి గుర్తింపును ఇచ్చే ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డు కూడా లభించింది. నిర్మాత దిల్ రాజు ఈ అవార్డును స్వీకరించారు. అయితే ఎట్టకేలకు నేడు దిల్ రాజు విజయవాడ లో ఏర్పాటు చేసిన గేమ్ చేంజర్ కటౌట్ లాంచ్ ఈవెంట్ లో అధికారికంగా ప్రకటించాడు.