ఐఫోన్‌ 15.. రూ.26999కే.. ఫ్లిప్‌కార్డు బంపర్‌ ఆఫర్‌

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 25: ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గ్లోబల్‌ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ సంస్థకు చెందిన ఐఫోన్లను కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. అయితే, ఆ కలలు అందరికీ నెరవేరవు. అందుకు కారణం సాధారణ ఫోన్లతో పోలిస్తే ఐఫోన్‌ ధరలు చాలా ఎక్కువగా ఉండడమే. దీంతో కొందరు బెస్ట్‌ డిస్కౌంట్స్‌ కోసం ఎదురుచూసి వాటిని సొంతం చేసుకుంటుంటారు. అలాంటి వారికి ఓ గుడ్‌ న్యూస్‌. గతేడాది మార్కెట్‌లోకి వచ్చిన ఐఫోన్‌ 15 (128)పై ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఊహించని డీల్‌ను ప్రకటించింది. రూ.69,990 విలువైన ఈ ఫోన్‌ను రూ.27వేలకే అందిస్తోంది.

సాధారణంగా 15 128 ధర రూ.69,990. ఈ ప్రీమియం డివైజ్‌ ఇప్పుడు పలు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌లను కలుపుకుని కేవలం రూ. 26,999కే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్‌లో గరిష్ఠంగా రూ.31,500 వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్‌ కల్పించింది. అందుకోసం మనం ఐఫోన్‌ 14ను ఎక్స్‌ఛేంజ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 26,999కే మీ సొంతం చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ మినహాయింపుతో అయితే గరిష్ఠంగా 16 శాతం తగ్గింపుతో రూ.58,499కు ఫోన్‌ లభిస్తోంది. అంతే కాదండోయ్‌.. దీనిపై ఫ్లిప్‌కార్ట్‌ ‘మినిట్స్‌’ డెలివరీ సేవను కూడా అందిస్తోంది.

ఎంపిక చేసిన ప్రదేశాల్లో కేవలం 14 నిమిషాల్లోనే ఈ ఫోన్‌ను డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఇందుకోసం అదనపు ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ఆఫర్‌ డిసెంబర్‌ 20 నుంచి 25 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. నేటితో ఈ ఆఫర్‌ ముగియనుంది. ఐఫోన్‌ 15 గతేడాది (2023) సెప్టెంబర్‌లోలో విడుదలైన విషయం తెలిసిందే. బ్లాక్‌, బ్లూ, గ్రీన్‌, పింక్‌, ఎల్లో రంగుల్లో లభిస్తుందీ ఫోన్‌. ఐఓఎస్‌ 17 వర్షన్‌పై పని చేస్తున్న ఐ-ఫోన్‌ 15 ఫోన్‌.. ఆపిల్‌ ఏ16 బయోనిక్‌ చిప్‌ కలిగి ఉంటుంది. 6.1 అంగుళాల సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ ఓలెడ్‌ స్క్రీన్‌, డైనమిక్‌ ఐలాండ్‌ వంటి ఫీచర్లు ఉంటాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News