మంచు కుటుంబంలో విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. నటుడు మంచు మనోజ్ తన సోదరుడు మంచు విష్ణుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. మనోజ్ చేసిన ఫిర్యాదులో మొత్తం 7 అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. మంచు విష్ణుతో పాటు వినయ్ అనే వ్యక్తిపై కూడా మనోజ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
