ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మనవడు, నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు సాధించాడు. 175 పజిల్స్ వేగంగా పూర్తిచేసి.. వేగవంతమైన చెక్ మేట్ సాల్వర్ -175 పజిల్స్ ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించారు.
