నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే స్కిల్ యూనివర్సిటీలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. తొలివిడతలో వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్, కీ కన్సయినర్, ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్స్‌లెన్స్, ఫార్మా అసోసియేట్ ప్రోగ్రామ్ కోర్సులను ప్రారంభించింది. ఈమేరకు స్కిల్ యూనివర్సిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఆసక్తిగల అభ్యర్థులు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వెబ్‌సైట్ https://yisu.in/ లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి