ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ నాయకులు ముట్టడించారు. రేవతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ వారు అల్లు అర్జున్ ఇంటి గోడలను ఎక్కి రాళ్లు రువ్వారు. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇంటి ముందు బైఠాయించారు.
