అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై ఆయన ప్రెస్‌క్లబ్‌లో ఏసీపీ విష్ణుమూర్తి ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పోలీసు కుటుంబాల తరపున ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర విమర్శలు చేశారు. తాను తప్పించుకోవడం కోసం పోలీసులపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి తీవ్ర హెచ్చరికలు చేశారు.
ఒక హీరో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే నడువదని స్పష్టం చేశారు. జరిగిన ఘటనపై ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారన్నారు. ఒక కేసులో ముద్దాయి ఉన్న వ్యక్తి ప్రెస్‌మీట్ పెట్టే అధికారం ఉందా..? ఈవిషయాలన్నీ కోర్టు దృష్టికి తీసుకెళ్లి బెయిల్ రద్దు చేయించొచ్చు అన్నారు. మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఎవరూ ఊరుకోరని.. ఎవ్వడైనా సరే తోలు తిస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు.