బౌన్సర్లు, ప్రైవేటు బాడీ గార్డ్స్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని తెలంగాణ పోలీసులు సూచనలు చేశారు. బౌన్సర్లు, ప్రైవేటు బాడీ గార్డ్స్ పేరుతో చట్టానికి వ్యతిరేకంగా ఎవరిపైనైనా దాడులు, బెదిరింపులు చేస్తే క్రిమినల్ కేసులతో పాటు జైలు ఊచలు లెక్కించక తప్పదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు వెంటాడుతాయి అని ‘ఎక్స్’ వేదికగా తెలంగాణ పోలీసులు ట్వీట్ చేశారు.
