నేషనల్ మీడియా ముందు తన ఇమేజ్ దెబ్బతీశారంటూ.. సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు లీగల్ టీమ్ ఒప్పుకోలేదనటం హాస్యాస్పదం. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇమేజ్ దెబ్బతిందని అంటున్నారు.. అని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి హీరో అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.
