కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను బీజేవైఏం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నీలం దినేష్, ఆదివారం మంత్రి నివాసంలో ఆదివారం మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 26న జరుగుతున్న తన వివాహానికి రావాలని కేంద్రమంత్రికి ఆహ్వాన పత్రిక అందజేశారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావుని కూడా కలిసి వివాహానికి రావాలని ఆహ్వాన పత్రికను అందజేసినట్టు దినేష్ తెలిపారు. వివాహానికి వస్తామని మంత్రి మాట ఇచ్చారన్నారు.
