ఒకే కుటుంబంలోని నలుగురు గిన్నిస్ రికార్డ్ సాధించారు. అనకాపల్లికి చెందిన విజయ్ చైనాలో ఉంటున్నాడు. అక్కడే యోగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశాడు. 2012లో విజయ్ యోగాసనాలు వేసి గిన్నిస్ రికార్డు సాధించగా.. ఆయన భార్య గర్భిణిగా ఉన్న సమయంలో 10 నిమిషాలు యోగాసనం వేసి రికార్డు నమోదుచేసింది. వారి కూతురు ఒంటికాలితో నిమిషానికి 160సార్లు, కుమారుడు ట్రాంపొలిన్పై ఎగురుతూ నిమిషానికి 129సార్లు స్కిప్పింగ్ చేసి ఈ రికార్డు సాధించారు.
