టీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన.. దిల్‌ రాజు

తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దిల్ రాజు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. దిల్ రాజు అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భముగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరపున తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని ఓ లేఖను విడుదల చేసింది. దిల్ రాజు నాయకత్వంలో తెలంగాణా రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షలు పి. భరత్ భూషణ్, గౌరవ కార్యదర్శులు కె. యల్. దామోదర్ ప్రసాద్, కె. శివ ప్రసాద రావు లేఖలో పేర్కొన్నారు.

దిల్ రాజు పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ ఆయన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ TFDC ఛైర్మన్‌గా అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News